పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ: ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ విధులు కేటాయించబడిన ఉద్యోగులు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్.ఐ.సీ హాల్ లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శించి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పోలీసు బందోబస్తు,...