పసుపు పంట క్షేత్రాలను సందర్శించిన కలెక్టర్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   సాగులో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకతను కలిగి ఉన్న నేపథ్యంలో, కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం మునిపల్లి శివారులోని పసుపు పంట క్షేత్రాలను సందర్శించారు. ఆలూరి పెద్ద మల్లయ్యకు చెందిన పసుపు సాగు క్షేత్రాన్ని ఆసక్తితో పరిశీలించారు. పసుపు సాగు విధానం, నేల స్వభావం, అనుకూలమైన రకాల గురించి రైతును అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా పసుపు తవ్వే విధానం, ఉడకబెట్టే విధానం, ప్రాసెసింగ్ చేసే పద్ధతి, పసుపు పంటను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేయు విధానం...