దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి

ఎస్సారెస్పీని సందర్శించిన కలెక్టర్ వరద ఉద్ధృతిపై ప్రాజెక్టు అధికారులతో సమీక్ష   మెండోరా, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను శనివారం జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రిజర్వాయర్లో నీటిమట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టు కు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బాలేగాం, బాబ్లీ బ్యారేజీలతో పాటు...