నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ చివరి రోజైన శుక్రవారం నాడు కలెక్టర్ ఇలా త్రిపాఠి విస్తృతంగా పర్యటిస్తూ, నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని బడా బజార్ వాటర్ ట్యాంక్ మున్సిపల్ జోన్ ఆఫీసును సందర్శించి నామపత్రాల స్వీకరణ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. చివరి రోజున సాయంత్రం 5.00 గంటల లోపు...