నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

. . . ఎన్నికల విధులను పక్కాగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల జాగరూకతతో వ్యవహరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని కంటేశ్వర్ మున్సిపల్ జోన్ ఆఫీసు, టీటీడీ కల్యాణ మండపంలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను...