మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ :   ఆర్మూర్ డివిజన్ లో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. జక్రాన్పల్లి మండలం మునిపల్లి, ఆర్మూర్ మండలం పిప్రి గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలను పరిశీలించారు. రైతుల నుండి సేకరించిన మొక్కజొన్న పంట నాణ్యతను తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద ఆరబెట్టిన మొక్కజొన్న నిల్వలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. కనీస మద్దతు ధర అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తేమ 14 శాతానికి లోబడి...