లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్

అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం జలాల్పూర్ - బడాపహాడ్ మార్గంలో రాకపోకల నిలిపివేత వాహనాల దారి మళ్ళింపు   నిజామాబాద్, బతుకమ్మ :  ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. నిజామాబాద్ నగరం, బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు వర్ని మండలం జలాల్పూర్ తదితర ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించారు. జలాల్పూర్ వద్ద లో లెవెల్ వంతెన పై నుంచి ప్రవహిస్తున్న వరద జలాలను పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం...