కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ లో కొనసాగుతున్న నిజామాబాద్ నార్త్ మండల కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను సందర్శించి ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి విద్యార్థినుల సామర్ధ్యాన్ని అంచనా వేశారు. కలెక్టర్ తానే స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో పలు అంశాలను బోర్డుపై రాసి...