కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నందిపేట మండల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. పాఠశాల ఆవరణను, డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. బియ్యం బస్తాలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఈగలు, దోమలు వృధ్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడ కూడా నీరు నిలువ ఉండకూడదని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం...