భవిత కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాలలో గల భవిత సెంటర్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంను తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన...