నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ సీళ్లను, పోలీసు బందోబస్తును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు ఉన్నారు.