డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అలూర్, ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు...