ధర్మపురి హిల్స్ కాలనీని సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ కాలనీని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. గతంలో అసైన్మెంట్ భూములను పంపిణీ చేసిన లబ్దిదారుల జాబితాను పరిశీలించారు. ప్రభుత్వం అందించిన నివేశన స్థలాలలో లబ్దిదారులే నివాసం ఉంటున్నారా అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. లబ్దిదారులుగా కొనసాగుతున్న వారి పట్టా సర్టిఫికెట్లను తెప్పించుకుని, అవి అధికారికంగా జారీ చేసినవేనా లేక నకిలీవా అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ధర్మపురి హిల్స్ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తులు చేసుకున్నాయి, ఎంత మందికి ఇప్పటివరకు...