మాతాశిశు సంరక్షణ, క్రిటికల్ కేర్ యూనిట్ ను సందర్శించిన కలెక్టర్ 

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మాతాశిశు సంరక్షణ (ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ యూనిట్ లతో కూడిన భవన సముదాయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. సుమారు 38.75 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అన్ని హంగులతో అందుబాటులోకి తెచ్చిన ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ యూనిట్ లను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ నెల 22న లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎంసీహెచ్ భవన సముదాయాన్ని శుక్రవారం సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు....