ఉపాధ్యాయురాలుగా అవతారం ఎత్తిన కలెక్టర్

  . . . కస్తూర్బా బాలికల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిసరాలను, కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, తరగతి గదులను పరిశీలించారు. పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులు పాములు, విష కీటకాల బారినపడితే ఎవరు బాధ్యులని నిలదీశారు....