బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా పాలనాధికారికి అదనపు కలెక్టర్లు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులతో భేటీ అయ్యి జిల్లా స్థితిగతులు,...