’పది‘ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవుని పల్లి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులను, చీఫ్ సూపరింటెండెంట్ గదులను పరిశీలించారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటు అధికారులతో మాట్లాడుతూ, పరీక్ష సమయానికి ముందే విద్యార్థులను నిశిత పరిశీలన చేసి కేంద్రం లోనికి పంపించాలని, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా చూడాలని తెలిపారు....