Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2025, 2:39 pm Posted by : ramakrishna

’పది‘ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవుని పల్లి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులను, చీఫ్ సూపరింటెండెంట్ గదులను పరిశీలించారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటు అధికారులతో మాట్లాడుతూ, పరీక్ష సమయానికి ముందే విద్యార్థులను నిశిత పరిశీలన చేసి కేంద్రం లోనికి పంపించాలని, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా చూడాలని తెలిపారు. కేంద్రంలో తాగునీరు, టాయిలెట్స్, మెడికల్ సదుపాయాలు, రవాణా వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ వెంకటరమణ, డిపార్టుమెంటు అధికారిణి మేరీ వర్ధనం, కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.