Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 6:50 pm Posted by : ramakrishna

జవహర్ నవోదయ క్యాంపస్ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జక్రాన్ పల్లి మండలం కలిగోట్ లో నెలకొల్పనున్న జవహర్ నవోదయ విద్యాలయ కొత్త క్యాంపస్ భవన నిర్మాణం పనుల పురోగతిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో వేగంగా జరిపించాలని, విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జవహర్ నవోదయ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ పి.జోజి బాబు, డిఈఓ అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.