ఇందిరమ్మ ఇళ్ళ పురోగతి, డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపుపై కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల పురోగతి, రెండు పడక గదుల కేటాయింపుపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసిన ఇళ్ళను లబ్దిదారులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మొదటి విడతలో ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం చేపట్టేందుకు...