ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై కలెక్టర్ సమీక్ష

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జరిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ఐకెపి ఏ.పీ.ఎంలు, సహకార సంఘాల మండల ఇంచార్జీలు, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసిల్దార్లతో ఒక్కో మండలం వారీగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులను సమీక్షించారు. ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సేకరించిన వరి ధాన్యం ఎంత, అందులో సన్నాలు ఎన్ని, దొడ్డు రకం ధాన్యం ఎంత పరిమాణంలో...