నగర అభివృద్ధి ప్రణాళికలపై కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. వివిధ విభాగాల అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే వార్డు ఆఫీసర్లతో క్రమం తప్పకుండా సమావేశమవుతూ నగర పురోభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో నగర పాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఒక్కో డివిజన్...