సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్ కు షోకాష్ నోటీస్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం
జుక్కల్, బతుకమ్మ : విధులలో నిర్లక్ష్యం వహించిన జుక్కల్ సామాజిక ఆసుపత్రి సూపరింటిండెంట్, డ్యూటీ డాక్టర్ కు షోకాష్ నోటీస్ ఇవ్వాలని డిసిహెచ్ఎస్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా జుక్కల్ మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది డ్యూటీ రిజిస్టర్ ను పరిశీలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్, డ్యూటీ డాక్టర్ డాక్టర్ విట్టల్ లు అందుబాటులో లేకపోవడంతో...