రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ధాన్యం బస్తాల అన్ లోడింగ్ లో జాప్యంపై ఆగ్రహం   నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రానికి సమీపంలో ఖానాపూర్ శివారులో కొనసాగుతున్న ఆర్.కె రైస్ మిల్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం పంపించారు, వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలన జరిపారు. అంతకుముందు కలెక్టర్ డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటివరకు ఎంతమంది రైతుల నుండి...