రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

  . . . ధాన్యం అన్ లోడింగ్ ను వేగవంతం చేయాలని ఆదేశం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని సాయి రాజలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ బాయిల్డ్ రైస్ మిల్లును కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం వచ్చింది, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు....