Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 7:34 pm Posted by : ramakrishna

సన్న బియ్యం పథకం ప్రారంభించిన కలెక్టర్

కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం యొక్క తూకాన్ని, నాణ్యతను పరిశీలించారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రజా పంపిణీ దుకాణాలలో అధికారులతో  ఆర్డీవోలు, జిల్లా పౌరసరఫరాల అధికారి, సహాయ పౌర సరఫరాల అధికారి, తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దారులు, డిటిసిఎస్, ఆర్ఐలతో తనిఖీలు నిర్వహించారు.

Collector launches Sanna Rice Scheme