డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన కలెక్టర్

నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న   విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లైబ్రరీకి కలెక్టర్ ప్రత్యేకంగా రూ. ఐదు లక్షల నిధులను సమకూర్చారు. ఈ నిధులతో పది కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీని నెలకొల్పారు.  ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న  నిరుద్యోగులు నగరానికి వచ్చి జిల్లా కేంద్ర...