Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 4:20 pm Posted by : ramakrishna

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గల  వడ్ల కొనుగోలు కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూకం వేసిన వడ్లు తీసుకుపోవడానికి లారీలు రాకపోవడంతో అక్కడే ఉండిపోయాయని ఫిర్యాదు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన స్పందిస్తూ లారీలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కమ్మర్ పల్లీ మండలంలోని కొనుగోలు కేంద్రానిక తనిఖీ చేయడానికి వెళ్లారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి, మోర్తాడ్ తాసిల్దార్ కృష్ణ, డిప్యూటీ తాసిల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు.