వెల్నెస్‌ సెంటర్‌ తనిఖీ చేసిన కలెక్టర్

సీనియర్‌ సిటిజన్లు, జర్నలిస్టుల కుటుంబాల కోసం వసతుల పెంపుకు చర్యలు నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న వెల్నెస్‌ సెంటర్‌ను శనివారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు   సందర్శించారు. సీనియర్‌ సిటిజెన్లు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో వసతులు, సేవలను పరిశీలించారు. వృద్ధులు, పింఛన్‌దారులు వైద్యం కోసం ఈ కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో, అవసరమైన వసతుల పెంపుపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. పరిశుభ్రత, వైద్య సేవల నాణ్యత...