పల్లె దవాఖాన, ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్

 బతుకమ్మ, బోధన్ : ఎడపల్లి మండలం జైతాపూర్, తానాకలాన్ గ్రామాలలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జైతాపూర్ గ్రామంలోని పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రూర్బన్ పథకం కింద నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన భవనానికి విద్యుత్ వసతి లేకపోవడాన్ని గమనించి, తక్షణమే విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రూ. లక్షల నిధులు వెచ్చించి నిర్మించిన భవనాలకు చిన్నచిన్న సదుపాయాలు కల్పించే విషయంలో తాత్సారం చేయడం వల్ల...