ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కై స్థలాలను పరిశీలించిన కలెక్టర్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :    అన్ని హంగులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఎంపిక చేసిన స్థలాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. ఆర్మూర్ శివారులోని పిప్రి రోడ్డులో గల స్థలంతో పాటు, అంకాపూర్ శివారులోని స్థలాన్ని స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం, రవాణా సదుపాయం, విద్యార్థులకు ఏ మేరకు భద్రత ఉంటుంది,...