సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద కొనసాగుతున్న రిజర్వాయర్ పనులను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. నీటి ప్రవాహాలతో కూడిన వాగులు, ఎత్తైన కొండ ప్రదేశాలను కాలి నడకన దాటుతూ, రిజర్వాయర్ బండ్ నిర్మిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్లూయిస్ ల నిర్మాణానికి అవసరమైన స్థలం విషయమై రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం నెలకొని ఉన్న ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. టోపో షీట్, గూగుల్ మ్యాప్ ల...