పాఠశాలలు, ఏటీసీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

చందూర్, బతుకమ్మ: ప్రభుత్వ పాఠశాలలు, ఐ.టీ.ఐలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు, అదే ఆవరణలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ముఖ గుర్తింపు విధానం(ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు తీసుకున్నారా అని పరిశీలించారు. విద్యార్థులు కోసం వండిన మద్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు....