రెసిడెన్షియల్ స్కూల్, అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలతో పాటు, అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండడాన్ని గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు. గురుకులంలో 640 మంది విద్యార్థినులు ఉండగా,...