పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్, పీహెచ్ సీలను తనిఖీ చేసిన కలెక్టర్
ల్యాబ్ గదుల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపండి స్టీమ్ యూనిట్ ను వినియోగంలోకి తేవాలని ఆదేశాలు నిజామాబాద్, బతుకమ్మ : మెండోరా మండలం పోచంపాడ్ లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ పాఠశాలలో కిచెన్ కం డైనింగ్ హాల్, స్టోర్ రూం డార్మెటరీలను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. సరుకుల స్టాక్ రిజిస్టర్ తనిఖీ...