నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని బోధన్ మండలం అమ్దాపుర్ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వికరణ కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు...