మోర్తాడ్ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ 

నిజామాబాద్, బతుకమ్మ : మోర్తాడ్ మండల కేంద్రంలోని  కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఉడకబెట్టిన కోడిగుడ్లు, నిర్ణీత రోజులలో మాంసాహారం అందిస్తున్నారా అని...