కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ : మాక్లూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను, గొట్టిముక్కలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కేజీబీవీ స్కూల్ ను సందర్శించి, స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని...