జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ : డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మెనూ బోర్డును పరిశీలించి, మెనూకు అనుగుణంగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఆహార  పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని,...