జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లా కేంద్రంలోని అర్సపల్లి లో గల ఏ.వీ ఎంటర్ ప్రైజెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్ లో కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. 175 మంది విద్యార్థులకు గాను ఉదయం సెషన్ పరీక్షకు 173 మంది, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 171 మంది హాజరయ్యారని కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు....