ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. గురువారం ఇంటర్ సెకండియర్ పరీక్ష కొనసాగగా, విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా? అని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ప్రథమ చికిత్స సదుపాయం, ఏ.ఎన్.ఎం, టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయా అని గమనించారు.     ఎలాంటి...