Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 6:24 pm Posted by : ramakrishna

ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. గురువారం ఇంటర్ సెకండియర్ పరీక్ష కొనసాగగా, విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా? అని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ప్రథమ చికిత్స సదుపాయం, ఏ.ఎన్.ఎం, టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయా అని గమనించారు.

 

Collector inspects Inter exam center

 

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్ కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉన్నారు.

 

Collector inspects Inter exam center