ప్రారంభోత్సవాలకు సిద్ధమైన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ :  ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి పరిశీలించారు. జైతాపూర్ లో 74 ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభమై, వివిధ దశలలో కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వీటిలో 15 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణాలు పూర్తి అయిన ఇళ్లను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ, ఒక్కో ఇంటి...