Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 12:07 pm Posted by : ramakrishna

ఇందిరా మహిళా శక్తి భవనం పనులను పరిశీలించిన కలెక్టర్

 

. . . జూన్ 2 లో పు భవనం సంబందిత శాఖకు అప్పగించాలి

నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమీపంలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన సముదాయంను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులను, వాటి నాణ్యతను పరిశీలించారు. చివరి దశలో ఉన్న పనులను సైతం వేగవంతంగా పూర్తి చేయించాలని, జూన్ 2 లోపు భవన సముదాయాన్ని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి భవనం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని సూచించారు.

Collector inspects Indira Mahila Shakti Bhavan works

తుది దశ పనులను కూడా నాణ్యతతో పూర్తి చేయించి, సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.  స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ భవనం దోహదపడనున్నందున ఎలాంటి సౌకర్యాలకు తావు లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓసాయన్న, జిల్లా పంచాయతీరాజ్ అధికారి బావయ్య, ఈ.ఈ వీరానంద్, మెప్మా ఏపీడీ మధుసూదన్ తదితరులు ఉన్నారు.

Collector inspects Indira Mahila Shakti Bhavan works