ఇందల్వాయి తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసిన కలెక్టర్
భూభారతి, ఎస్ఐఆర్ అమలు తీరు పరిశీలన ఇందల్వాయి, బతుకమ్మ : భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇందల్వాయి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్వ ప్రక్రియ అమలుపై సమీక్ష జరిపారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ...