ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్. బతుకమ్మ :  వర్ని మండలం జాకోరా, జలాల్పూర్ గ్రామాలలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని సేకరించారు, ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ టాగ్ అయ్యిందా, కొత్త గన్నీ బ్యాగులు అందాయా అని ఆరా తీశారు. గత ఏడాది ఇదే సీజన్ లో...