ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
శుభ్రపర్చిన ధాన్యం తెచ్చి పూర్తి మద్దతు ధర పొందాలని రైతులకు హితవు నిజామాబాద్, బతుకమ్మ : ఆర్మూర్ మండలం మంథని, జక్రాన్పల్లి మండలం కేశ్ పల్లి గ్రామాలతో పాటు మోర్తాడ్ మండల కేంద్రంలో ఐకెపి మహిళా సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన...