ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డ్, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరును, పేషంట్ల కేస్ షీట్లను తనిఖీ చేశారు. ప్రతీ రోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, మాతా శిశు మరణాలు ఏమైనా చోటుచేసుకున్నాయా, అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు.  ...