ఎరువుల గోడౌన్, పల్లె దవాఖాన ను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : జక్రాన్ పల్లి, డిచ్ పల్లి మండలాల్లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. డిచ్ పల్లి మండలం నడిపల్లి గ్రామంలోని పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోడౌన్ ను తనిఖీ...