Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 8:00 pm Posted by : ramakrishna

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ శనివారం సందర్శించారు. సాధారణ తనిఖీలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఈవీఎం గోడౌన్ సీళ్లను, పోలీసు బందోబస్తును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు ఉన్నారు.